Pawan Kalyan: నిన్ను చూసి గర్విస్తున్నాం.. సివిల్స్ ఫస్ట్ ర్యాంకర్ అనుదీప్‌కు జనసేన చీఫ్ పవన్ అభినందనలు

  • సివిల్స్-2017 ఫలితాల్లో అనుదీప్‌కు ఫస్ట్ ర్యాంక్
  • అనుదీప్‌ను అభినందిస్తూ పవన్ ట్వీట్
  • తల్లిదండ్రులు, స్నేహితులు, ఉపాధ్యాయులకు అభినందనలు

మెట్‌పల్లి జిల్లాకు చెందిన సివిల్స్ టాపర్ దురిశెట్టి అనుదీప్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. సివిల్స్‌లో ఫస్ట్ ర్యాంకు సాధించిన నిన్ను చూసి తామంతా గర్విస్తున్నామని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అనుదీప్ తల్లిదండ్రులు, స్నేహితులు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం విడుదల చేసిన సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2017 ఫలితాల్లో అనుదీప్ టాపర్‌గా నిలవగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మెరుగైన ర్యాంకులు సాధించారు. శీలం సాయితేజ (43వ ర్యాంకు), నారపురెడ్డి మౌర్య (100వ ర్యాంకు), జి.మాధురి (144వ ర్యాంకు), వివేక్ జాన్సన్ (195వ ర్యాంకు), ఎడవల్లి అక్షయ కుమార్ (624వ ర్యాంకు), భార్గవ శేఖర్ ( 816వ ర్యాంకు), అమిలినేని భార్గవ్ తేజ 88వ ర్యాంకు సాధించారు. అనంతపురం జిల్లా సోమవారవాండ్ల పల్లికి చెందిన భార్గవ్ తేజ ఢిల్లీలో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేస్తున్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుమారుడు సాయి ప్రణీత్ 196వ ర్యాంకు సాధించాడు.

Pawan Kalyan
Jana Sena
Anudeep
Telangana
Civils
  • Loading...

More Telugu News