civils 2017: సివిల్స్ -2017 ఫలితాలు విడుదల .. టాపర్ గా దురిశెట్టి అనుదీప్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుమారుడు సాయి ప్రణీత్ కు 196వ ర్యాంకు

  • సివిల్స్- 2017 ఫలితాలను విడుదల చేసిన యూపీఎస్సీ
  • ఓబీసీ కేటగిరికి చెందిన అనుదీప్
  • తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు అభ్యర్థులకు మెరుగైన ర్యాంకులు

సివిల్స్- 2017 టాపర్ గా జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్ నిలిచాడు. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ -2017 ఫైనల్స్ ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కాసేపటి క్రితం విడుదల చేసింది. ఓబీసీ కేటగిరికి చెందిన అనుదీప్ టాపర్ గా నిలవడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

మరోపక్క, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు అభ్యర్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. శీలం సాయితేజ (43వ ర్యాంకు), నారపురెడ్డి మౌర్య (100వ ర్యాంకు), జి.మాధురి (144వ ర్యాంకు), వివేక్ జాన్సన్ (195వ ర్యాంకు), ఎడవల్లి అక్షయ కుమార్ (624వ ర్యాంకు), భార్గవ శేఖర్ ( 816వ ర్యాంకు), అమిలినేని భార్గవ్ తేజ 88వ ర్యాంకు సాధించారు. కాగా, భార్గవ్ తేజ స్వస్థలం అనంతపురం జిల్లాలోని సోమవార వాండ్ల పల్లి. ప్రస్తుతం అతను ఢిల్లీలో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేస్తున్నారు. కాగా, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుమారుడు సాయి ప్రణీత్ 196వ ర్యాంకు సాధించాడు. 

  • Loading...

More Telugu News