Narendra Modi: చైనా పర్యటనలో ఉన్న మోదీకి రాహుల్ గాంధీ ట్వీట్

  • చైనా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ
  • మోదీ పర్యటనకు ఎజెండా లేదంటూ రాహుల్ ఎద్దేవా
  • డోక్లాం, చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ గురించి మాట్లాడాలంటూ హితవు

చైనా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మోదీది ఎలాంటి ఎజెండా లేని పర్యటన అంటూ ఎద్దేవా చేశారు. చైనా ప్రధానితో సమావేశం సందర్భంగా కీలక అంశాలపై మాట్లాడాలని భారతీయులంతా కోరుకుంటున్నారని చెప్పారు. మోదీని ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ ఇలా ఉంది.

'డియర్ ప్రైమ్ మినిష్టర్,
చైనాలో మీరు చేపట్టిన 'ఎజెండా లేని' పర్యటన గురించి లైవ్ టీవీ ఫీడ్ చూశా.
మీరు చాలా టెన్షన్ గా కనిపిస్తున్నారు.
మీకు కొన్ని గుర్తు చేస్తున్నాను.
1. డోక్లాం.
2. చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ పీఓకే గుండా వెళుతోంది. అది భారతదేశ భూభాగం.
మీరు ఈ విషయాలపై మాట్లాడతారని దేశం ఆశతో ఉంది.
మీకు మా మద్దతు ఉంటుంది'

Narendra Modi
China
trip
Rahul Gandhi
tweet
doklam
cpec
  • Error fetching data: Network response was not ok

More Telugu News