yogi adithyanath: యోగి ఆదిత్యనాథ్ వస్తే.. బీజేపీకే నష్టం: సిద్ధరామయ్య

  • కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న యోగి ఆదిత్యనాథ్
  • యోగి రావడం వల్ల బీజేపీకి ఉపయోగం లేదన్న సిద్దూ
  • సీఎం అయిన ఏడాదిలోనే యోగి విఫలమయ్యారంటూ ఎద్దేవా

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 35కు పైగా ర్యాలీల్లో పాల్గొంటారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో... యోగిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శలు గుప్పించారు. ఇప్పటికే బీజేపీకి యోగి ఆదిత్యనాథ్ భారంగా మారారని ఆయన ఎద్దేవా చేశారు.

ఇక కర్ణాటక ఎన్నికల ప్రచారంలో యోగి పాల్గొంటే... అది బీజేపీకే నష్టాన్ని చేకూరుస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి అయిన ఏడాదిలోనే ఆయన దారుణంగా విఫలమయ్యారని... ఆయన సొంత నియోజకవర్గంలోనే బీజేపీ ఓడిపోయిందని చెప్పారు. 3వ తేదీన కర్ణాటకలో యోగి ఆదిత్యనాథ్ పర్యటన ప్రారంభమవుతుందని... 10వ తేదీ వరకు ఆయన పలు ర్యాలీల్లో పాల్గొంటారని బీజేపీ శ్రేణులు తెలిపాయి. 

yogi adithyanath
siddaramaiah
Karnataka
elections
campaign
  • Loading...

More Telugu News