Narendra Modi: మోదీని జగన్, పవన్‌ ఎందుకు నిలదీయడంలేదు?: గల్లా జయదేవ్‌

  • మేము ప్రత్యేక హోదాపై పోరాడుతున్నాం
  • ఎన్డీయే నుంచి బయటికి వచ్చాం
  • జగన్‌, పవన్‌ చిత్తశుద్ధితో పోరాడాలి

తాము ప్రత్యేక హోదాపై పోరాడుతోంటే వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎందుకు నిలదీయడం లేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రశ్నించారు. ఈ రోజు ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదాపై తాము కేంద్ర సర్కారుపై ఒత్తిడి పెంచుతున్నామని, ఇప్పటికైనా జగన్, పవన్ చిత్తశుద్ధితో పోరాడాలని గల్లా జయదేవ్ చెప్పుకొచ్చారు.

ప్రత్యేక హోదా కోసం తాము ఎన్డీయే నుంచి బయటికి వచ్చామని, పవన్‌ కల్యాణ్‌ మాత్రం ఎందుకు వెనకాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, ఆ తీరు మంచిది కాదని అన్నారు. మోదీ సినిమాలో పవన్‌‌, జగన్‌ అద్భుతంగా నటిస్తున్నారని ఆయన చురకలంటించారు. 

Narendra Modi
Pawan Kalyan
Jagan
galla
  • Loading...

More Telugu News