Karnataka: ఈ బీజేపీ అభ్యర్థి భార్య ఎలా ఓట్లు అడుక్కుంటోందో చూడండి: వీడియో పోస్టు చేసిన నటుడు ప్రకాష్ రాజ్

  • కర్ణాటకలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు
  • మంగళూరు సౌత్ నుంచి బీజేపీ తరఫున బరిలో వేదవ్యాస్ కామత్
  • హిందూ మతాన్ని గుర్తు చేస్తూ ఓట్లు అడుగుతున్న వైనం

కర్ణాటకలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలూ గెలుపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో భాగం కాగా, ఓ బీజేపీ అభ్యర్థి భార్య మతాన్ని ప్రస్తావిస్తూ చేస్తున్న ఎన్నికల ప్రచార వీడియోను నటుడు ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ, ఇదేం పనని ప్రశ్నించారు.

"బీజేపీ అభ్యర్థి భార్య ఎలా ఓట్లను అడుక్కుంటోందో చూడండి. దక్షిణ కర్ణాటకలోని మంగళూరు ప్రాంతంలో ఆమె మతాలను గుర్తు చేస్తూ తన భర్తకు ఓట్లు వేయాలని అడుగుతున్నారు. కమ్యూనల్ పాలిటిక్స్ సిగ్గుచేటు. ఇదేనా మీ 'సబ్ కీ సాథ్ సబ్ కా వికాస్' అని అడుగుతున్నాను" అని అన్నారు.

 ఈ వీడియోలో "అందరికీ నమస్కారం. నేను మంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న వేదవ్యాస్ కామత్ ధర్మపత్నిని. ఈ దఫా ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గం నుంచి నా భర్తను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థన" అంటూ హిందూ మతాన్ని ప్రస్తావించినట్టు కనిపిస్తోంది.

Karnataka
Assembly Elections
Mangalore
Communal Politics
  • Loading...

More Telugu News