justice: జస్టిస్ ఈశ్వరయ్య వ్యాఖ్యలపై యనమల ఆగ్రహం

  • బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారన్న ఈశ్వరయ్య
  • టీడీపీ హయాంలో 9 మంది బీసీలు హైకోర్టు జడ్జిలు అయ్యారన్న యనమల
  • ఈశ్వరయ్య కూడా ప్రధాన న్యాయమూర్తి అయ్యారు

బీసీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారంటూ హైకోర్టు రిటైర్డ్ జడ్జి, జాతీయ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య చేసిన వ్యాఖ్యలపై మంత్రి యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను టీడీపీకి దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని... ఈ కుట్రలను బీసీలే తిప్పికొడతారని అన్నారు. తెలుగుదేశం హయాంలో 9 మంది బీసీలను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించారని అన్నారు. కొందరు మహిళలు కూడా హైకోర్టు జడ్జిలు అయ్యారని చెప్పారు. ఈశ్వరయ్య సహా ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులు అయ్యారని తెలిపారు. తమ పార్టీ హయాంలోనే బీసీలకు అత్యధిక పదోన్నతులు లభించాయని చెప్పారు. 

  • Loading...

More Telugu News