: బాబుపై సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు?: విజయమ్మ
అవినీతి ఆరోపణలు చంద్రబాబుపైనా వచ్చాయని, ఆయనపై సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. జగన్ కు బెయిల్ దక్కకపోవడంపై నేడు విజయమ్మ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ, జగన్ కు బెయిల్ రాకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు బయటే ఉన్నారని, వారు సాక్ష్యాలు తారుమారు చేయరా? అని ఆమె ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.