paruchuri gopalakrishna: 'ప్రామిస్' అని మహేశ్ అన్నప్పటికీ .. అది కొరటాల చెప్పినట్టుగా అనిపించింది: పరుచూరి గోపాలకృష్ణ

  • భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'భరత్'
  • మంచి రాజకీయం ఎలా ఉండాలనేది చెప్పాడు 
  • జనం కోరుకునేది ఆవిష్కరించాడు

 వినోదం .. సందేశం కలగలిసిన చిత్రంగా 'భరత్ అనే నేను' మంచి మార్కులు కొట్టేసింది. సామాన్య ప్రేక్షకుడి మనసును సైతం ఈ సినిమా తాకగలిగింది. దాంతో అనేక మంది ఈ సినిమా పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి 'పరుచూరి పలుకులు'లో గోపాలకృష్ణ ప్రస్తావించారు.

" ఈ సినిమాలో హీరో ఒకచోట 'ప్రామిస్' అన్నాడు. కానీ నాకు అది కొరటాల గొంతులా వినిపించింది. అదేంటండీ అలా అంటారు అని మీకు ఆశ్చర్యం కలగొచ్చు. మంచి రాజకీయం ఎలా ఉండాలి? అనే సినిమాను .. సినిమా టిక్ గా కాకుండా, జనం ఏం భావిస్తున్నారో .. ఆ భావనతోనే ఈ సినిమాను తీస్తాను అని కొరటాల ప్రామిస్ చేశాడని నేను అనుకుంటున్నాను. 'శ్రీమంతుడు'లా కాకుండా, 'భరత్ అనే నేను' లో ఓపెనింగ్ షాట్ తోనే అసలు కథలోకి తీసుకెళ్లడం కొరటాల గొప్పతనం" అంటూ ప్రశంసించారు. 

paruchuri gopalakrishna
  • Loading...

More Telugu News