Anam Vivekananda Reddy: ఆనం రాంనారాయణకు ఫోన్ చేసిన వైఎస్ జగన్!

  • ఆనం వివేక మృతిపట్ల సంతాపం
  • ఆయన మృతి దిగ్భ్రాంతిని కలిగించింది
  • త్వరలోనే స్వయంగా వస్తానన్న జగన్

నిన్న ఉదయం హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో మరణించిన తెలుగుదేశం నేత ఆనం వివేకానంద రెడ్డి మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సంతాపం వెలిబుచ్చారు. ఈ ఉదయం వివేక సోదరుడు రాంనారాయణ రెడ్డికి ఫోన్ చేసి ఓదార్చిన జగన్, ఆ తరువాత ఆయన కుమారుడు విజయ్ కుమార్ రెడ్డితోనూ మాట్లాడారు.

వివేక మృతితో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, పాదయాత్రలో ఉన్నందున స్వయంగా పరామర్శించడానికి రాలేకపోతున్నానని, తరువాత స్వయంగా వస్తానని కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, ఆనం సోదరులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వేళ వైఎస్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండేవారన్న సంగతి తెలిసిందే. ఆనం రెండోతరం వారసులు త్వరలో వైసీపీలో చేరనున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, వీటిపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

Anam Vivekananda Reddy
Anam Brothers
Jagan
  • Loading...

More Telugu News