anam vivekananda reddy: వైయస్ కోసం నేదురుమల్లి వర్గాన్ని ఛిన్నాభిన్నం చేసిన ఆనం వివేకానంద

  • మాగుంట హత్య తర్వాత ఆయన వర్గాన్ని మొత్తం కలుపుకున్న వివేక
  • నెల్లూరు జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగిన వైనం 
  • ఏనాడూ పదవీకాంక్ష లేని వివేక

మంచి రాజకీయ చతురత కలిగిన వ్యక్తిగా దివంగత ఆనం వివేకానందరెడ్డికి పేరుంది. ఆయన వేసే ఎత్తుగడలు, పన్నే వ్యూహాలు ప్రత్యర్థులను కోలుకోకుండా దెబ్బతీస్తాయి. వైయస్ రాజశేఖరరెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం నెల్లూరుకు చెందిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి కుటుంబానికి ఎదురు తిరిగిన వివేక... అనతి కాలంలోనే వారి వర్గాన్ని ఛిన్నాభిన్నం చేశారు.

అదే జిల్లాకు చెందిన మరో ముఖ్య నేత మాగుంట సుబ్బరామిరెడ్డి హత్య తర్వాత... ఆయన వర్గాన్ని మొత్తం తమతో కలుపుకుని తిరుగులేని శక్తిగా ఎదిగారు. జిల్లాలో ఒక బలమైన వర్గాన్ని తయారు చేసుకున్నారు. వివేకాలో ఉన్న నాయకత్వ లక్షణాలు వారి కుటుంబ పరపతిని మరింత పెంచాయి.

ఇంత ఉన్నా ఆయనకు పదవీ వ్యామోహం లేకపోవడం గమనార్హం. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినా మంత్రి పదవిని ఆయన చేపట్టలేదు. మంత్రి పదవి ఇస్తానంటూ రాజశేఖరరెడ్డి స్వయంగా ఆఫర్ చేసినా... తన తమ్ముడు రాంనారాయణరెడ్డికి ఇవ్వమని చెప్పారు. తాను మాత్రం నెల్లూరు రాజకీయాలకే పరిమితం అయ్యారు. 

anam vivekananda reddy
ysr
magunta subbarami reddy
nedurumalli
  • Loading...

More Telugu News