anam vivekananda reddy: ప్రియనేతకు తుది వీడ్కోలు పలికేందుకు పోటెత్తుతున్న అభిమానులు.. కాసేపట్లో నెల్లూరుకు చంద్రబాబు

  • వివేకా మరణంతో కన్నీటిసంద్రమైన నెల్లూరు
  • నివాళి అర్పించేందుకు నెల్లూరు వస్తున్న ముఖ్యమంత్రి
  • పెన్నా తీరంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

తమ ప్రియతమ నేత ఆనం వివేకానంద రెడ్డి మరణంతో నెల్లూరు కన్నీటిసంద్రమైంది. వివేకా ఇక లేరు అనే వార్తను అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. వివేకాకు నివాళి అర్పించేందుకు ఈ తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో అభిమానులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించి, కన్నీటిపర్యంతం అవుతున్నారు. మారుమూల గ్రామాల నుంచి సైతం వివేకాను కడసారి చూసేందుకు జనాలు నెల్లూరుకు చేరుకుంటున్నారు.

మరోవైపు, కాసేపట్లో నెల్లూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా వివేకాకు ఆయన నివాళి అర్పించి, కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేయనున్నారు. ఈ సాయంత్రం వివేకా అంతిమ యాత్ర మొదలవుతుందని ఆయన సోదరుడు, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. అధికారిక లాంఛనాలతో పెన్నా తీరంలో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన చెప్పారు. వివేకా లేకపోతే రాజకీయమే లేదని అన్నారు. 

anam vivekananda reddy
funerals
Chandrababu
nellore
  • Loading...

More Telugu News