jc diwakar reddy: రాజకీయాల్లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. పార్లమెంటు విషయం తెలియదు: జేసీ దివాకర్ రెడ్డి

  • అన్ని చోట్లా ఉన్నట్టే రాజకీయాల్లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంది
  • మోదీ ఏమీ ఇవ్వరనే విషయాన్ని మూడున్నరేళ్ల క్రితమే చంద్రబాబుకు చెప్పా
  • చంద్రబాబు కంటే బాగా పాలించేవారు రాష్ట్రంలో లేరు

క్యాస్టింగ్ కౌచ్ అన్ని చోట్లా ఉందని, పార్లమెంటు కూడా దానికి అతీతం కాదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, అన్ని చోట్లా ఉన్నట్టే రాజకీయాల్లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పారు. అయితే, పార్లమెంటులో ఉన్నట్టు మాత్రం తనకు తెలియదని అన్నారు.

ఏపీకి ప్రధాని మోదీ ఏమీ ఇవ్వడనే విషయాన్ని మూడున్నర సంవత్సరాల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను చెప్పానని జేసీ తెలిపారు. చంద్రబాబు తెలివైన వ్యక్తి కాబట్టే కేంద్రంతో నాలుగేళ్లు కలిసి ఉన్నారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న తపన ఉన్నప్పటికీ... చంద్రబాబు ఒక్కరే ఆ పని చేయలేరు కదా అని చెప్పారు. రాష్ట్రంలో పరిపాలన అత్యద్భుతంగా ఉందని తాను చెప్పనని... కానీ, చంద్రబాబు కంటే బాగా పాలించేవారు మాత్రం ఎవరూ లేరని అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 

jc diwakar reddy
Chandrababu
renuka chowdary
Casting Couch
Narendra Modi
  • Loading...

More Telugu News