anam viveka: ఆనం వివేకానంద రెడ్డి మరణం చాలా బాధ కలిగించింది: పవన్‌ కల్యాణ్‌

  • ఆనం వివేకానందకు నివాళి
  • ఆయన ఏపీకి చేసిన సేవలు శ్లాఘనీయం
  • ఆనం వివేకానంద ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలి

'మాజీ ఎమ్మెల్యే, మా కుటుంబానికి ఆత్మీయుడు ఆనం వివేకానంద రెడ్డి మృతి నాతో పాటు నా కుటుంబానికి తీవ్ర ఆవేదనను కలిగించింది' అని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. "మూడుసార్లు ఎమ్మెల్యేగా నెల్లూరు నుంచి శాసన సభకు ప్రాతినిధ్యం వహించిన వివేకానంద రెడ్డి పేద, బడుగు వర్గాల నేతగా ఖ్యాతి పొందారు. ఆయన నెల్లూరు జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ కు చేసిన సేవలు శ్లాఘనీయం. నా తల్లి గారి పుట్టినిల్లు కూడా నెల్లూరు కావడంతో ఆనం కుటుంబం ఆమెను తమ ఆడపడుచుగా భావించేవారు.

ఆ విధమైన ఆత్మీయానుబంధం ఉన్న ఆనం కుటుంబానికి చెందిన వివేకానంద రెడ్డి మరణించడం చాలా బాధ కలిగించింది. ఈ సందర్భంగా  వివేకానంద రెడ్డికి నివాళి అర్పిస్తూ ఆయన ఆత్మకు ఆ భగవంతుడు శాంతిని చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను. వివేకానంద రెడ్డి కుటుంబానికి నా తరఫున, జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.

ఆయన అంతిమ సంస్కార కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రతినిధిగా జనసేన పార్టీ రాజకీయ సలహా సంఘం కన్వీనర్, సీనియర్ రాజకీయవేత్త మాదాసు గంగాధరం పాల్గొంటారు. వివేకానంద అంతిమ యాత్రలో జనసేన కార్యకర్తలు ఆయనకు నివాళులు అర్పిస్తారు" అని పవన్ కల్యాణ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

anam viveka
Pawan Kalyan
Jana Sena
  • Loading...

More Telugu News