jd lakshminarayana: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా ఆమోదం!

  • లక్ష్మీనారాయణ వీఆర్ఎస్ కు ప్రభుత్వ ఆమోదం
  • మహారాష్ట్ర అదనపు డీజీపీ హోదాలో రిటైర్మెంట్
  • ఏపీ సీబీఐ జేడీగా పని చేసిన లక్ష్మీనారాయణ

సీబీఐ మాజీ జేడీ, మహారాష్ట్ర అదనపు డీజీపీ లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇటీవలే ఆయన వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి వచ్చేందుకే లక్ష్మీనారాయణ వీఆర్ఎస్ తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

అయితే, తన రాజీనామా ఆమోదం పొందిన తర్వాతే తాను తన భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడతానని ఆయన ఇంతకు ముందే చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన నుంచి ఇంత వరకు రాజకీయ రంగప్రవేశంపై ఒక్క ప్రకటన కూడా రాలేదు. ఉమ్మడి ఏపీలో సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పని చేసిన లక్ష్మీనారాయణ... ఆ తర్వాత ప్రమోషన్ పై మహారాష్ట్రకు వెళ్లారు. 

jd lakshminarayana
retirement
vrs
accepted
  • Loading...

More Telugu News