Mahesh Babu: మహేష్ బాబు, సినీ పరిశ్రమపై చలసాని శ్రీనివాస్ విమర్శలు

  • హోదా ఉద్యమంలో సినీ పరిశ్రమ పాల్గొనలేదు
  • తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు
  • ఉద్యమంలో మహేష్ బాబు పాల్గొనకపోయినా.. సంపూర్ణేష్ బాబు పాల్గొన్నారు

సినీ పరిశ్రమపై ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. ఇప్పటిదాకా ప్రత్యేక హోదా ఉద్యమంలో సినీ పరిశ్రమ పాల్గొనలేదని ఆయన దుయ్యబట్టారు. హోదా కోసం తెలంగాణ నాయకులు కూడా మద్దతు తెలుపుతుంటే... సినీ పరిశ్రమ మాత్రం తమకు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

త్వరలోనే ఫిల్మ్ ఇండస్ట్రీకి అల్టిమేటం ఇస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పాల్గొనలేదని... ఇదే సమయంలో తెలంగాణకు చెందిన నటుడు సంపూర్ణేష్ బాబు పాల్గొన్నారని అన్నారు. చిత్తూరు నుంచి బెంగళూరుకు తలపెట్టిన పాదయాత్రకు ఎన్నికల కోడ్ వల్ల అనుమతి లభించలేదని చెప్పారు. జూన్ తర్వాత విద్యార్థులతో కలసి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని తెలిపారు. 

Mahesh Babu
sampoornesh babu
Tollywood
chalasari srinivas
special status
  • Loading...

More Telugu News