rangasthalam: రూ.200 కోట్ల క్లబ్‌లో 'రంగస్థలం'

  • దూసుకుపోతోన్న రామ్‌ చరణ్‌ కొత్త సినిమా
  • చెర్రీ సినిమాలన్నింటిలోనూ అత్యధిక వసూళ్లు సాధించిన 'రంగస్థలం'
  • గత నెల 30న విడుదలైన పీరియాడిక్‌ ఎమోషనల్‌ డ్రామా

1980ల నాటి గ్రామీణ వాతావరణంలో ఎమోషనల్‌ డ్రామాగా రామ్‌ చరణ్‌, సమంత, ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాశ్‌ రాజ్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించిన చిత్రం 'రంగస్థలం'. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌, మోహన్ చెరుకూరి కలసి నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. గత నెల 30న విడుదలైన ఈ సినిమా మ‌రో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తాజాగా 200 కోట్ల క్లబ్‌లో చేరింది. మగధీర తరువాత 'రంగస్థలం' అంతటి స్థాయిలో చరణ్‌కి హిట్‌ తెచ్చిపెట్టింది. రామ్ చరణ్ సినిమాలన్నింటిలోనూ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.  

rangasthalam
Ramcharan
sukumar
  • Loading...

More Telugu News