nakka: కుట్ర బయటపడింది.. అందుకే గవర్నర్‌ నరసింహన్‌ను వ్యతిరేకిస్తున్నాం: ఏపీ మంత్రి ఆనందబాబు

  • రాజకీయ వ్యవహారాల్లో గవర్నర్‌ జోక్యం ఏమిటి?
  • అన్ని కుట్రల్లోనూ గవర్నర్‌ సూత్రధారిగా వ్యవహరిస్తున్నారు
  • గవర్నర్‌ అసలు వైఖరి ఇప్పుడు బయటపడింది

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ నరసింహన్‌పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నక్కా ఆనంద బాబు నరసింహన్‌ తీరు బాగోలేదని విమర్శించారు. రాజకీయ వ్యవహారాల్లో గవర్నర్‌ జోక్యం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా కేంద్రంగా కుట్ర జరుగుతోందని, అందులో గవర్నర్‌ నరసింహన్‌ పాత్రధారని ఆనందబాబు ఆరోపించారు. అంతేగాక, అన్ని కుట్రల్లోనూ గవర్నర్‌ సూత్రధారిగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. గవర్నర్‌ నరసింహన్‌ అసలు వైఖరి ఇప్పుడు బయటపడిందని, అందుకే తాము ఆయనను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

nakka
Andhra Pradesh
esl narasimhan
  • Loading...

More Telugu News