Telugudesam: ఆనం మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పరుచూరి గోపాలకృష్ణ, నటుడు శివాజీ!
- ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచిన ఆనం వివేకానందరెడ్డి
- సంతాపం తెలిపిన పలువురు ప్రముఖలు
- పరుచూరి గోపాలకృష్ణ, శివాజీ నివాళులు
సీనియర్ రాజకీయవేత్త, టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి మృతి పట్ల ప్రముఖ టాలీవుడ్ రచయిత, దర్శకుడు పరుచూరి గోపాలకృష్ణ, నటుడు శివాజీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని నెలకొల్పుకుని రాజకీయాలలో పదిమందిని ఆకర్షించి, నవ్వించి, కవ్వించి, నేడు అందరినీ విడిచి దివికేగిన ఆనం వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.