Casting Couch: సినీ పెద్దలంతా దేవుళ్లలా వ్యవహరిస్తారు... నేనేం చెప్పినా నిలబడదు: బీబీసీ ఇంటర్వ్యూలో హీరోయిన్ రాధికా ఆప్టే

  • క్యాస్టింగ్ కౌచ్ బహిరంగ రహస్యం
  • ప్రాంతీయ భాషల పరిశ్రమల్లో కూడా
  • మిగతా రంగాల్లోనూ ఇదే పరిస్థితన్న రాధికా ఆప్టే

సినీ పరిశ్రమలోని పెద్దలంతా తాము దేవుళ్లలా వ్యవహరిస్తుంటారని, ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై తాను ఏమైనా ఆరోపణలు చేసినా, ఎవరి గురించైనా చెప్పినా అవి నిలబడవని హీరోయిన్ రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేసింది. "బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ - చీకటి కోణాలు" అనే అంశంపై బీబీసీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తూ, రాధికా ఆప్టే అభిప్రాయాన్ని కోరగా, ఆమె ఈ విధంగా మాట్లాడింది.

తాను ఏ చిత్ర సంస్థకు, లేదా నిర్మాతకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదని, బాలీవుడ్ సహా ప్రాంతీయ భాషల చిత్ర పరిశ్రమలోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయం బహిరంగ రహస్యమని వ్యాఖ్యానించింది. సినిమా పరిశ్రమతో పాటు మిగతా అన్ని రంగాల్లోనూ ఈ పరిస్థితి ఉందని చెప్పింది. కాగా, సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై ఇప్పుడు తీవ్ర దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే.

Casting Couch
Tollywood
Bollywood
BBC
Radhika Apte
  • Loading...

More Telugu News