Andhra Pradesh: మధ్యలోనే ముగిసిన గవర్నర్ హస్తిన పర్యటన... తిరిగి హైదరాబాద్ కు పయనం!

  • నిన్న సాయంత్రం న్యూఢిల్లీ వెళ్లిన నరసింహన్
  • నేడు ప్రధాని, హోం మంత్రులతో భేటీ రద్దు
  • తిరుగు పయనంలో నరసింహన్

తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ న్యూఢిల్లీ పర్యటన అర్థాంతరంగా ముగిసింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలుసుకునేందుకు నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ఆయన, తన పర్యటనను మధ్యలోనే ముగించుకుని ఈ ఉదయం హైదరాబాద్ బయలుదేరారు.

ఇలా ఆయన పర్యటన మధ్యలోనే ముగియడం, ప్రధానితో భేటీ కాకపోవడం, నేడు షెడ్యూల్ లో ఉన్న హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ తో చర్చలు సాగకపోవడం కొత్త చర్చను తెరపైకి తెచ్చింది. కాగా, ఇటీవలి కాలంలో గవర్నర్ తటస్థంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వస్తుండటం, నిన్న ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్టుగా గవర్నర్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేసిన నేపథ్యంలో నరసింహన్ తన పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణం కావడం గమనార్హం.

Andhra Pradesh
ESL Narasimhan
Chandrababu
New Delhi
  • Loading...

More Telugu News