Karnataka: బాలకృష్ణ వ్యాఖ్యలు సరికాదు: నటుడు సాయికుమార్

  • కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతున్న సాయికుమార్
  • బాగేపల్లి నుంచి బీజేపీ తరఫున పోటీ
  • నరేంద్ర మోదీపై వ్యక్తిగత విమర్శలు సరికాదు
  • హోదా కోసం మోదీ కాళ్లపై పడతానన్న సాయికుమార్

ప్రధాని నరేంద్ర మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని నటుడు సాయికుమార్ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో చిక్ బళ్ళాపూర్ జిల్లా బాగేపల్లి నుంచి బీజేపీ తరఫున పోటీ పడుతున్న సాయికుమార్, ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తాను నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకోవడానికైనా సిద్ధమేనని చెప్పారు. హోదా కోసం ఆయన కాళ్లపై పడతానని అన్నారు. ఎన్నికల ప్రచారానికి తాను బాలకృష్ణను పిలవడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాగా, 2008 ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన సాయికుమార్, మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Karnataka
Balakrishna
Saikumar
  • Loading...

More Telugu News