bank services: బ్యాంకు ఖాతాదారులపై త్వరలో పన్నుల భారం?

  • గత ఐదేళ్ల కాలానికి పన్ను నోటీసులు
  • ఎస్ బీఐ, హెచ్ డీఎఫ్సీ సహా కొన్ని బ్యాంకులకు జారీ
  • చెల్లింపు, ఉచిత సేవలపైనా పన్ను కట్టాలని డిమాండ్

చార్జీలపై పన్నులు చెల్లించాలంటూ బ్యాంకులకు పన్ను శాఖా నోటీసులు జారీ చేసింది. గడిచిన ఐదేళ్ల కాలానికి సంబంధించి ఖాతాదారుల నుంచి వసూలు చేసిన పెనాల్టీ చార్జీలు, ఖాతాల్లో మినిమం బ్యాలన్స్ ఉంచిన వారికి అందించిన ఉచిత సేవలపైనా పన్ను కట్టండంటూ బ్యాంకులను కోరింది. ఈ మేరకు డైరక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ విభాగం షోకాజు నోటీసులు జారీ చేసింది. ఎస్ బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహింద్రా బ్యాకు, యాక్సిస్ బ్యాంకు లకు ఈ నోటీసులు అందాయి.

గత ఐదేళ్ల కాలానికి గాను ఖాతాదారులకు అందించిన పెయిడ్, ఫ్రీ సేవలపై రెట్రో స్పెక్టివ్ పన్ను కట్టాలన్నది నోటీసుల సారాంశం. అయితే, తాము ఖాతాదారులకు గత కాలంలో అందించిన సేవలపై పన్నును వారి నుంచి వసూలు చేసుకోలేమని, పన్ను కట్టాల్సే వస్తే ఇకపై ఖాతాదారులు ఆ భారాన్ని మోయాల్సి వస్తుందని బ్యాంకులు అంటున్నాయి. అయితే, ఈ లోపు ఈ అంశాన్ని కేంద్ర సర్కారు దృష్టికి తీసుకెళ్లి నిలిపివేయించే ప్రయత్నాలు చేయనున్నట్టు ఓ బ్యాంకు అధికారి తెలిపారు,.

  • Loading...

More Telugu News