Social Media: నకిలీ సోషల్ మీడియా ఖాతాలపై పోలీసులకు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఫిర్యాదు

  • సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు తెరిచారు
  • తప్పుడు పోస్టులు పెడుతున్నారు
  • చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

తమ సంస్థలైన ఏబీఎన్ న్యూస్ చానల్, ఆంధ్రజ్యోతి దినపత్రిక పేరిట నకిలీ సోషల్ మీడియా ఖాతాలు తెరిచి, తప్పుడు పోస్టులు పెడుతూ, దుష్ప్రచారాలకు దిగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

'ఆర్కే ఏబీఎన్' పేరిట ట్విట్టర్ లో ఓ నకిలీ ఖాతాను తెరిచారని, తమ లోగో, చానల్ బ్రేకింగ్ న్యూస్ స్క్రీన్ షాట్లు తీసి, వాటిని మార్ఫింగ్ చేసి వివాదాస్పద కంటెంట్ ను తయారు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు విచారణ జరిపి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, తన పేరుతో గానీ, ఆర్కే పేరుతోగానీ ఎలాంటి ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలు లేవని రాధాకృష్ణ నిన్న వెల్లడించిన సంగతి తెలిసిందే.

Social Media
ABN
Andhrajyoti
Radhakrishna
Fake Accounts
Hyderabad
Police
  • Loading...

More Telugu News