BJP: ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి మాజీ ఉన్నతాధికారి పేరు పరిశీలన?

  • తెరపైకి ఎవ్వరూ ఊహించని పేరు
  • ఇటీవలే రాజీనామా సమర్పించిన అధికారి
  • ఆయనకు ఇవ్వడమే మేలని భావిస్తున్న బీజేపీ పెద్దలు

ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎవరూ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. అఖిల భారత స్థాయిలో ఉన్నత పదవిని నిర్వహిస్తూ, ఇటీవలే రాజీనామా సమర్పించిన వ్యక్తికి ఈ పదవిని ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ ప్రతిపాదన ఇంకా సంప్రదింపుల స్థాయిలోనే వుందని సమాచారం. ఇక పార్టీలో చేరిన వెంటనే ఉన్నత పదవిని ఇవ్వడం బీజేపీ సంప్రదాయానికి వ్యతిరేకమే అయినప్పటికీ, సదరు అధికారికి ఉన్న ప్రత్యేకత దృష్ట్యా ఏపీలో పార్టీ బలోపేతానికి అదే మంచి మార్గమని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.

ఇదిలావుండగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించి ఆపై అది దక్కే అవకాశం లేదని భావిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలోకి వెళ్లే అవకాశాలు ఉండటంతో, ఇక పోటీలో సోము వీర్రాజు, పైడికొండల మాణిక్యాలరావు, ఆకుల సత్యనారాయణ మాత్రమే మిగిలారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను, రాజకీయ సమీకరణాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

BJP
Andhra Pradesh
CBI JD
Lakshminarayana
Kanna
Akula Satyanarayana
Somu Veeraju
  • Loading...

More Telugu News