raj pal yadavi: బాలీవుడ్ నటుడు రాజ్ పాల్ యాదవ్ కి ఆరు నెలల జైలు శిక్ష!

  • రవితేజతో కిక్ 2లో నటించిన రాజ్ పాల్ యాదవ్
  • 5 కోట్లు చెల్లించని కేసులో రాజ్ పాల్ యాదవ్ కు శిక్ష ఖరారు  
  • వెంటనే బెయిల్ మంజూరు 

ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు రాజ్‌ పాల్‌ యాదవ్‌ కు ఆరు నెలల జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. దాని వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఎంజీ అగర్వాల్‌ నుంచి తన తొలి హిందీ చిత్రం ‘అతా పతా లప‌తా’ కోసం 2010లో రాజ్ పాల్ యాదవ్ 5 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. తిరిగి చెల్లించకపోవడంతో ఆయన ఢిల్లీలోని కర్ కర్ డుమా న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.

దీనిని విచారించిన న్యాయస్థానం రాజ్ పాల్ ను దోషిగా తేల్చి, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తున్నట్టు తీర్పునిచ్చింది. అనంతరం రాజ్ పాల్ యాదవ్ బెయిల్ కి దరఖాస్తు చేసుకోగా, వెంటనే మంజూరైంది. కాగా, రాజ్ పాల్ యాదవ్ ‘భూల్‌ భులయ్యా’, ‘పార్ట్‌ నర్‌’, ‘హంగామా’, ‘వెల్‌ కమ్‌ బ్యాక్‌’ తదితర విజయవంతమైన హిందీ సినిమాలతో పాటు రవితేజ ‘కిక్‌ 2’లో కూడా కనిపించాడు. 

raj pal yadavi
6 months prison
The jail sentence was finalized
  • Loading...

More Telugu News