Gai janardhan reddy: కర్ణాటకలో ‘గాలి’కి మళ్లీ మంచి రోజులు..మొత్తం ఏడుగురికి టికెట్లిచ్చిన బీజేపీ!

  • గనుల కుంభకోణంలో జైలుకు వెళ్లిన తర్వాత పట్టించుకోని బీజేపీ
  • ప్రస్తుతం మారిన సమీకరణాలు
  • మళ్లీ చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్న జనార్దన రెడ్డి

ఒకప్పుడు కర్ణాటకలో చక్రం తిప్పిన బీజేపీ నేత గాలి జనార్దనరెడ్డికి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి. ఇనుప గనుల కుంభకోణంలో ఇరుక్కుని జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత గాలి కుటుంబాన్ని బీజేపీ పూర్తిగా పక్కనపెట్టింది. బళ్లారిలో ఆయన అడుగుపెట్టకూడదన్న కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి పోటీ చేసి గెలిచే అవకాశం లేకుండాపోయింది. దీంతో ఆయన సోదరులిద్దరికీ బీజేపీ టికెట్లు ఇవ్వడం ద్వారా పార్టీ ‘గాలి’కి అండగా ఉంటుందని భరోసా ఇచ్చినట్టు అయింది.

వచ్చే నెల జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనార్దనరెడ్డి అన్న కరుణాకర్‌రెడ్డి దావణగరె జిల్లా హరప్పనహళ్లి నుంచి, తమ్ముడు సోమశేఖరరెడ్డి బళ్లారి సిటీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక శ్రీరాములు మేనల్లుడు సురేశ్ బాబు కంపలి నుంచి, మేనమామ సన్న పకీరప్ప బళ్లారి రూరల్ నుంచి పోటీలో ఉన్నారు. అంటే.. మొత్తం జనార్దన్ రెడ్డి, శ్రీరాముల కుటుంబం నుంచి ఏడుగురు ఈ ఎన్నికల్లో బరిలో ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి టికెట్లు ఇవ్వడం ద్వారా ‘గాలి’ కుటుంబానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నదీ బీజేపీ చెప్పకనే చెప్పినట్టు అయింది.

  • Loading...

More Telugu News