Bonda Uma: శ్రీరెడ్డి సాక్షి టీవీలో పని చేసింది: బోండా ఉమ

  • టీడీపీపై మహాకుట్ర
  • ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు
  • ప్రజలు నమ్మరు
  • జగన్‌ బండారం మరింత బయటపడుతుంది

ఆపరేషన్‌ గరుడలో భాగంగానే ఏపీలో ఇన్ని కుట్రలు జరుగుతున్నాయా? అని ప్రజలు అడుగుతున్నారని, వారికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ సమాధానం చెప్పాలని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. మహాకుట్రలో భాగంగానే టీడీపీపై కొందరు ఆరోపణలు చేస్తున్నారని, ఇటువంటి రాజకీయాలు చేసేవారిని ప్రజలు నమ్మరని అన్నారు. రాజకీయ నాయకుల కన్నా ప్రజలు తెలివైన వారని, ఇటువంటి పార్టీలు మనుగడ సాగించలేవని వ్యాఖ్యానించారు.

పవన్ కల్యాణ్‌ పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నారని, వ్యక్తిగత లాభం కోసమే మాట్లాడుతున్నారని బోండా ఉమ అన్నారు. తాము ఏప్రిల్‌ 30న తిరుపతిలో సభ నిర్వహిస్తున్నామని, మోదీ తీరుని ఎండగడతామని చెప్పారు. వెంకన్న సాక్షిగా 2014లో తిరుపతిలో ఇచ్చిన హామీలను మోదీ విస్మరించారని, తాము వీడియో క్లిప్పింగులతో పాటు చూపిస్తున్నామని అన్నారు. కేసుల మాఫీ కోసం వైసీపీ ఎంతకైనా తెగిస్తోందని, ప్రధాని కాళ్లు పట్టుకుంటోందని, రాబోయే రోజుల్లో జగన్‌ బండారం మరింత బయటపడుతుందని అన్నారు.

సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న యువనటి శ్రీరెడ్డి కూడా గతంలో సాక్షి టీవీలో పని చేసిందని బోండా ఉమ అన్నారు. అలాగే కత్తి మహేశ్‌తో పాటు తమన్నా అనే అమ్మాయి వెనుక కూడా వైసీపీ ఉందని, వీరందరినీ ఆ పార్టీ ఉపయోగించుకుంటోందని అన్నారు. జగన్‌, పవన్ చేసే ఆరోపణలను ప్రజలు నమ్మరని చెప్పారు.

Bonda Uma
Telugudesam
Pawan Kalyan
  • Loading...

More Telugu News