oru aadhar love: తన తొలి హీరోని విష్ చేసిన ప్రియా ప్రకాశ్ వారియర్!

  • ప్రియా ప్రకాశ్ వారియర్, రోషన్ అబ్దుల్ రహూఫ్ జంటగా పరిచయం 
  • జూన్ లో విడుదల కానున్న'ఒరు అదార్ లవ్'
  • రోషన్ కి శుభాకాంక్షలు చెప్పిన ప్రియ 

‘ఒరు అదార్ లవ్‌’ సినిమాలో ‘మాణిక్య మలరయ’ పాటలో అందమైన కనుసైగలతో యావద్దేశాన్ని తనవైపు తిప్పుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్ ట్విట్టర్ ద్వారా తన హీరోకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ, 'నాకు ఇష్టమైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇక ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది? ఎందుకంటే మీకందరికీ తెలుసు'.. అంటూ పేర్కొంది.

తొలి సినిమా విడుదల కాకుండానే స్టార్ డమ్ సంపాదించుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్.. తన తొలి సినిమా ‘ఒరు అదార్‌ లవ్‌’ కథానాయకుడు రోషన్‌ అబ్దుల్‌ రహూఫ్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. ఈ సినిమా జూన్ లో విడుదల కానుంది. 

oru aadhar love
priya prakash vehrier
malayalam movie
  • Loading...

More Telugu News