KCR: సవాల్ కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం... నీళ్లివ్వకుంటే ఓట్లడగం: సీఎం కేసీఆర్
- మిషన్ భగీరథ పనులపై అధిాకారులతో సమీక్ష
- డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశం
ఇంటింటికీ నల్లా ద్వారా నీరు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని చేసిన సవాల్ కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇంటింటికీ నీరు ఇచ్చే లక్ష్యంతో చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు పనుల గురించి అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు నాలుగైదు నెలల ముందుగానే ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు నీళ్లిచ్చేలా చర్యల్ని వేగిరం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ఏడాది డిసెంబర్ ను గడువుగా పెట్టుకుని పనులు చేయాలని సూచించారు. ఈ సమీక్ష కార్యక్రమంలో మిషన్ భగీరథ ప్రాజెక్టు చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, పార్టీ ఎంపీలు మల్లారెడ్డి, సుఖేందర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.