Prakash Raj: కాకిని జాతీయ పక్షిగా ప్రకటించాలంటున్న ప్రకాశ్ రాజ్!

  • హిందువులు ఎక్కువగా ఉన్నారని హిందూ దేశం అంటారా?
  • అయితే కాకులు ఎక్కువగా ఉన్నాయిగా జాతీయ పక్షిని చేయండి
  • మోదీ అంటే అందుకే కోపం: ప్రకాశ్ రాజ్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తరచూ విరుచుకుపడుతున్న సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఈసారి వినూత్న ప్రతిపాదనతో ముందుకొచ్చారు. హిందువులు ఎక్కువగా ఉన్నారని భారత్‌ను హిందూ దేశం అని ఎలా పిలుస్తారన్న ఆయన, ఒకవేళ అందుకు సంఖ్యే ప్రామాణికం అనుకుంటే కాకిని జాతీయ పక్షిగా ప్రకటించాలని కోరారు.

జాతీయ పక్షి మయూరాల సంఖ్య కంటే కాకుల సంఖ్యే ఎక్కువ కాబట్టి నెమలికి బదులు కాకినే జాతీయ పక్షిగా ప్రకటించాలని సూచించారు. బెంగళూరులో సామాజిక ఉద్యమకారిణి, జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య జరిగిన వెంటనే సంబరాలు చేసుకున్న వారిని ప్రధాని మోదీ ఎందుకు వ్యతిరేకించలేదని ప్రకాశ్ రాజ్ నిలదీశారు. ఈ విషయంలో ఆయన మౌనంగా ఉన్నందుకే వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.

Prakash Raj
Narendra Modi
Crow
peacock
  • Loading...

More Telugu News