Telugudesam: ఇవే సంఘటనలు పునరావృతమైతే నేనంటే ఏమిటో చేతల్లో చూపిస్తా : ఏవీ సుబ్బారెడ్డి

  • నిందితులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశా
  • మంత్రి అఖిలప్రియుల వర్గీయులే దాడి చేశారని చెప్పా
  • ఈ సంఘటనను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లా
  • పార్టీ శ్రేయస్సు దృష్ట్యా నేను మౌనం వహించాల్సి ఉంది

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై అతని ప్రత్యర్థులు రాళ్ల దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై ‘ఏబీఎన్’ తో ఆయన మాట్లాడుతూ, ఎవరైతే దాడి చేశారో వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు విలేకరులు ఉన్నారని, సీసీటీవీ ఫుటేజ్ ల ఆధారాలు ఉన్నాయని అన్నారు. తనపై దాడి చేసిన వారు ఒక వాహనంలో వచ్చారని, మంత్రి అఖిలప్రియుల వర్గీయులే తనపై దాడి చేశారని డీఎస్పీకి ఫిర్యాదు చేశానని చెప్పారు.

గత ముప్పైఐదేళ్లుగా భూమా కుటుంబానికి అండగా ఉన్న తనపై అఖిల ప్రియ వర్గీయులు దాడి చేయడంతో తాను షాక్ కు గురయ్యానని అన్నారు. తాను, అఖిలప్రియ ఒకే పార్టీలో ఉన్నాము కనుక, పార్టీ శ్రేయస్సు దృష్ట్యా తాను మౌనం వహించాల్సిన అవసరం ఉందని చెప్పిన ఆయన, ఈ సంఘటనను అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. ఇవే సంఘటనలు పునరావృతమైతే ఏవీ సుబ్బారెడ్డి అంటే ఏమిటో మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తాని హెచ్చరించారు.  

Telugudesam
av subbareddy
  • Error fetching data: Network response was not ok

More Telugu News