: పడిపోయిన పారిశ్రామిక ఉత్పత్తి


దేశాభివృద్ధికి కీలకమైన పారిశ్రామిక ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. గడచిన డిసెంబర్ నెలకు దేశ పారిశ్రామిక ఉత్పత్తి కేవలం 0.6 శాతం మాత్రమే నమోదైంది. ఇది 2012 డిసెంబర్ నెలలో 2.7 శాతంగా ఉంది. అంటే రెండు శాతానికి పైగా తగ్గింది. ఈ రంగంలో పెట్టుబడులు క్షీణించడం, మార్కెట్లో ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు.

మొత్తానికి ఇది ఈ ఏడాది వృద్ధి రేటుపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. అలాగే వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నందున ఈ ఏడాది బడ్జెట్ ప్రజాకర్షణగా ఉంటుందని, వృద్ధికి అనుకూలంగా ఉండదని చెబుతున్నారు. దీంతో వచ్చే ఆర్థిక ఏడాదిలో కూడా  వృద్ధి పెద్దగా పెరగకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News