Pawan Kalyan: అందుకే పవన్ కల్యాణ్‌ నిన్న అలా చేశారు.. మీడియాపై దాడిని ఖండిస్తున్నాం: ఏపీ మంత్రి కళా వెంకట్రావు

  • పవన్‌ చేస్తున్నవి ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు కావు
  • రాజకీయ పార్టీ నాయకులు ప్రజా సమస్యలపై పోరాడాలి
  • ఛానెళ్ల దృష్టి మళ్లించడానికి పవన్ నిన్నటి కార్యక్రమం చేశారు

సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేస్తున్నవి ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు కావని, రాజకీయ పార్టీ నాయకులు ప్రజా సమస్యలపై పోరాడాలి కానీ ఇలా చేయడమేంటని ఏపీ మంత్రి కళా వెంకట్రావు విమర్శించారు. ఈ రోజు విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్ష చేస్తోన్న కారణంగానే పవన్ కల్యాణ్ అర్ధరాత్రి నుంచి ట్వీట్లు మొదలు పెట్టారని, ఛానెళ్ల దృష్టి మళ్లించడానికే అలాంటి కార్యక్రమం చేశారని అన్నారు. నిన్న మీడియాపై జరిగిన దాడులను ఖండిస్తున్నామని వ్యాఖ్యానించారు.

కాగా, బీజేపీపై కూడా మంత్రి కళా వెంకట్రావు మండిపడ్డారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీని ప్రజలు క్షమించరని, మన నమ్మకాన్ని వమ్ము చేసినప్పుడు ఒక్కొక్కరి స్పందన ఒక్కోలా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.         

Pawan Kalyan
kala venkat rao
Telugudesam
  • Loading...

More Telugu News