Narendra Modi: శ్రీలంక అధ్యక్షుడిని మోదీగా పేర్కొన్న బీబీసీ.. తప్పు తెలుసుకుని క్షమాపణ
- మైత్రిపాల సిరిసేనను మోదీగా పేర్కొంటూ వార్త
- తప్పుడు సమాచారం వల్లే జరిగిందన్న బీబీసీ
- విచారం వ్యక్తం చేస్తూ మోదీకి క్షమాపణ
ప్రత్యక్ష ప్రసారంలో దొర్లిన తప్పుకు బ్రిటష్ మీడియా సంస్థ బీబీసీ భారత ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పింది. చోగం సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేసిన బీబీసీ.. సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనను పొరపాటున భారత ప్రధాని నరేంద్ర మోదీగా పేర్కొంది.
బకింగ్ హ్యామ్ ప్యాలెస్‌లో రాణి ఎలిజబెత్ 2 ఇచ్చిన విందుకు కారులో వచ్చిన సిరిసేనను చూపిస్తూ.. ‘మే 14 నుంచి భారత ప్రధానిగా ఉన్న మోదీని చూడండి’ అని బీబీసీ యాంకర్ చదివారు. దీంతో అందరూ విస్తుపోయారు. తర్వాత తప్పు తెలుసుకున్న బీబీసీ శుక్రవారం మోదీకి క్షమాపణలు తెలిపింది. యాంకర్‌కు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లే ఈ పొరపాటు జరిగిందని విచారం వ్యక్తం చేసింది. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నట్టు తెలిపింది.