Mahesh Babu: అభిమానులకు నాలుగు భాషల్లో ధన్యవాదాలు తెలియజేసిన మహేశ్

  • 'భరత్ అనే నేను'కి మంచి రెస్పాన్స్ 
  • అభిమానుల్లో ఆనందోత్సాహాలు 
  • హర్షాన్ని వ్యక్తం చేసిన మహేశ్

మహేశ్ బాబు తాజా చిత్రంగా 'భరత్ అనే నేను' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఈ రోజు ఉదయం తొలి ఆటకి వచ్చిన రెస్పాన్స్ చూసి తాను ఆనందంతో పొంగిపోతున్నట్టుగా ట్వీట్ చేశాడు. ఈ సినిమాను ఇంతగా ఆదరిస్తోన్న అభిమానులకు ఆయన తెలుగు .. తమిళ .. హిందీ .. ఇంగ్లిష్ భాషల్లో ధన్యవాదాలు తెలియజేశాడు.

ఇంతకుముందు మహేశ్ చేసిన 'బ్రహ్మోత్సవం' .. 'స్పైడర్' సినిమాలు భారీ పరాజయాలను చవిచూశాయి. మహేశ్ తో పాటు ఆయన అభిమానులను నిరాశపరిచాయి. అప్పటి నుంచి మహేశ్ బాబు నుంచి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ను అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్ ఇలా ట్వీట్ చేయడం సక్సెస్ కి సంకేతమేనని అనుకోవాలి.       

Mahesh Babu
kiara advani
  • Loading...

More Telugu News