roja: చంద్రబాబు చేస్తున్నది నిరాహారదీక్ష కాదు: రోజా

  • చంద్రబాబుది ఉపవాసదీక్ష
  • రోజంతా తినకుండా ఉంటే దాన్ని ఉపవాసం అంటారు
  • జగన్ కు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి చంద్రబాబు భయపడుతున్నారు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. ఆయన చేపట్టినది నిరాహారదీక్ష కాదని, ఉపవాసదీక్ష అని ఎద్దేవా చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉంటే... దాన్ని ఉపవాసమనే అంటారని చెప్పారు. పార్లమెంటులో మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసి, ఏపీ భవన్ లో నిరాహారదీక్షకు దిగి ఉంటే... కేంద్రం కదిలివచ్చేదని అన్నారు.

కానీ, టీడీపీ ఎంపీలు ఢిల్లీలో డ్రామాలు ఆడారని విమర్శించారు. విజయవాడలో మొన్న జగన్ కు జనాలు బ్రహ్మరథం పట్టారని... ఆ భయంతోనే చంద్రబాబు ఇప్పుడు దీక్షకు కూర్చున్నారని చెప్పారు. టిఫిన్లు చేసి వచ్చి దీక్షలు చేపడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దీక్షకు రూ. 30 కోట్లు ఖర్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. 

roja
Chandrababu
jagan
hunger strike
  • Loading...

More Telugu News