Hyderabad: కృష్ణానగర్‌ లో బాంబు పేలుడు కలకలం

  • యూసఫ్ గూడ కృష్ణానగర్‌ లో బాంబు పేలుడు
  • సినిమా షూటింగ్స్ లో ఉపయోగించే స్మోక్ బాంబు తయారీ
  • తయారు చేస్తుండగా పేలిన బాంబు

హైదరాబాదులో సంభవించిన స్మోక్ బాంబు పేలుడులో వ్యక్తి గాయపడడం కలకలం రేపింది. దాని వివరాల్లోకి వెళ్తే.. యూసఫ్ గూడలోని కృష్ణానగర్‌ బి బ్లాక్ లోని మొదటి అంతస్తులో సిలిండర్ల సాయంతో అశోక్ అనే యువకుడు స్మోక్ బాంబులు తయారు చేస్తుండగా, పేలుడు సంభవించింది. ఈ పేలుడులో అశోక్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి.

కాగా, సినిమా షూటింగ్స్ కోసం అశోక్ ఈ బాంబులు తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే నింబంధనలు ఉల్లంఘించి ఈ స్మోక్ బాంబులు తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

Hyderabad
srikrushnanagar
smoke bomb blast
  • Loading...

More Telugu News