Pawan Kalyan: న్యాయవాదులతో పవన్ కల్యాణ్, నాగబాబు భేటీ.. ఫిలిం ఛాంబర్ కు చేరుకున్న అల్లు అర్జున్
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-75cfd3cb00c6629e27ef0b327b549484f058919e.jpg)
- ఫిలిం ఛాంబర్ లో పవన్, నాగబాబు, అల్లు అర్జున్
- న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న జనసేనాని
- భారీగా చేరుకుంటున్న అభిమానులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అన్న నాగబాబుతో కలసి ఫిలింఛాంబర్ చేరుకున్నారు. న్యాయవాదులతో వీరిద్దరూ సమావేశమయ్యారు. తన తల్లిని బహిరంగంగా దూషించిన ఘటనపై ఆయన న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ సమావేశానికి అల్లు అర్జున్ కూడా వచ్చాడు.
తన తల్లిని బహిరంగంగా దూషించారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం నుంచి ఆయన వరుస ట్వీట్లతో తన ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. తన తల్లిని తిట్టించడంలో టీడీపీ బాసులకు టీవీ9 రవిప్రకాశ్, రామ్ గోపాల్ వర్మ, శ్రీసిటీ యజమాని శ్రీని రాజులు సహకరించారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-287a5feacb93cf72281af0a856d782d4be6352a2.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-68c4fc44722eb2f55eb5205f5f4fee88dcec0807.jpg)