tammareddy bharadwaja: చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పను: తమ్మారెడ్డి భరద్వాజ

  • చంద్రబాబు దీక్షకు శుభాకాంక్షలు చెబుతున్నా
  • రాష్ట్రం కోసం పోరాడుతున్న వ్యక్తిపై విమర్శలు వద్దు
  • రాష్ట్రానికి మోసం చేసింది బీజేపీనే

విజయవాడలో చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబుకు తాను జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన చేపట్టిన ధర్మ దీక్షకు మాత్రం శుభాకాంక్షలు చెబుతున్నానని తెలిపారు. చాలా మంది చంద్రబాబును నమ్మబోమని అంటున్నారని... అలాంటి వారికి ఇంగిత జ్ఞానం ఉండాలని మండిపడ్డారు. ఈ రోజు చంద్రబాబు చేపట్టిన దీక్ష రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అవసరమైందా? కాదా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం కోసం పోరాడుతున్న చంద్రబాబు... మధ్యలో పోరాటాన్ని ఆపేస్తే రాష్ట్ర ద్రోహిగా మిగులుతారని... ఆ మాత్రం మీరు అర్థం చేసుకోలేరా? అని అన్నారు. విమర్శలు చేసేవారికి ఇంగితం ఉండాలని చెప్పారు.

ప్రజలందరి కోసం ఒక వ్యక్తి పోరాడుతుంటే... ఆయన గతంలో ఏదో చేశాడని ఆరోపిస్తూ, పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని తమ్మారెడ్డి మండిపడ్డారు. మనల్ని బీజేపీ మోసం చేసిందనే విషయం అందరికీ తెలుసని... అయినా మనవాళ్లు వాళ్లతోనే కలుస్తుంటారని, వాళ్లు చెప్పేదే నమ్ముతారని దుయ్యబట్టారు. టీడీపీ కోసమో, చంద్రబాబు కోసమో మనం పోరాడటం లేదని, రాష్ట్రం కోసం పోరాడుతున్నామని అన్నారు. చంద్రబాబు చేపట్టిన పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ఒక్కొక్కరు ఒక్కో కుంపటి పెట్టుకుని, ఆ కుంపట్లో కూర్చొని, ఏదేదో మాట్లాడుతూ పోతే... రాష్ట్రానికి న్యాయం జరగదని అన్నారు. 

tammareddy bharadwaja
Chandrababu
dharma porata deeksha
tollywood
  • Loading...

More Telugu News