sharwanand: పల్లెటూరి పిల్లగా కల్యాణి ప్రియదర్శన్

  • సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ 
  • కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ కి ఛాన్స్ 
  • 1980 నేపథ్యంలో కొనసాగే కథ

'హలో' సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆ సినిమాలో కథానాయికగా చేసిన కల్యాణి ప్రియదర్శన్ కి మంచిపేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో యూత్ లో ఈ అమ్మాయి మంచి మార్కులు కొట్టేసింది. దాంతో యువ హీరోల సినిమాల్లో చకచకా ఛాన్సులు దక్కుతున్నాయి. అలాగే ఈ అమ్మాయి శర్వానంద్ తాజా చిత్రంలో చోటు సంపాదించుకుంది.

ప్రస్తుతం శర్వానంద్ .. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 1980 నేపథ్యంలో కొనసాగుతుందట. ఇందులో మాఫియా డాన్ గా శర్వానంద్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడని అంటున్నారు. ఇక కల్యాణి ప్రియదర్శన్ పల్లెటూరి పిల్లగా కనిపిస్తుందని చెబుతున్నారు. మరి ఈ పాత్రలో ఈ అమ్మాయి ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.   

  • Loading...

More Telugu News