mohan babu: ‘మహాత్మా.. ఈ దేశంలో ఎక్కడున్నాడు మంచి పొలిటీషియన్..?’ : నటుడు మోహన్ బాబు

  • ‘అడవిలో అన్న’లోని డైలాగ్ ను పోస్ట్ చేసిన డైలాగ్ కింగ్
  • చర్చనీయాంశమైన పోస్ట్
  • కొన్నాళ్లుగా మోహన్ బాబు మళ్లీ రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు

ప్రముఖ సినీ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు ఇటీవల హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయమై మోహన్ బాబు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ విషయాన్ని పక్కనపెడితే, మోహన్ బాబు చేసిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా ఉంది. సరైన రాజకీయనాయకుడు ఎక్కడున్నాడంటూ అందులో ఆయన ప్రశ్నించారు.

సుమారు ఇరవై సంవత్సరాల క్రితం తాను నటించిన ‘అడవిలో అన్న’ చిత్రంలో తాను చెప్పిన ఓ డైలాగ్ ను మోహన్ బాబు ఈ పోస్ట్ లో ప్రస్తావించారు. ‘మహాత్మా.. నువ్వు స్వాతంత్య్రం తెచ్చిన ఈ దేశంలో ఎక్కడున్నాడు మంచి పొలిటీషియన్.. ఎక్కడ చూసినా అంతా పొల్యూషన్.. దీనికుంది ఒకే ఒక సొల్యూషన్.. అదే.. అదే.. పీపుల్ రెవల్యూషన్’ అన్నదే ఆ డైలాగు. కాగా, ప్రస్తుత రాజకీయాలను ఉటంకిస్తూ మోహన్ బాబు చేసిన ఈ పోస్ట్ చర్చనీయాంశమైంది. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News