sada: అందరూ నిరాకరించిన పాత్రలో సదా .. నిర్మాతగానూ రంగంలోకి!

  • వేశ్య పాత్రలో సదా 
  • టైటిల్ గా 'టార్చిలైట్'
  • దర్శకుడిగా మజీద్

తెలుగు తెరకి నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసిన నిన్నటితరం కథానాయికలలో సదా ఒకరు. తెలుగులో ఆమె చేసినది కొన్ని చిత్రాలే అయినా, ఆ పాత్రలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే అభిమానులు ఆశించిన స్థాయిలో ఆమె నిలదొక్కుకోలేకపోయింది. అలాంటి సదా తాజాగా తమిళంలో 'టార్చ్ లైట్' అనే ఒక సినిమా చేయడానికి అంగీకరించింది.

కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమాకి మజీద్ దర్శకత్వం వహించనున్నాడు. వేశ్య జీవితానికి సంబంధించిన కథా కథనాలతో ఈ సినిమా కొనసాగుతుందట. అందువలన ఈ సినిమా చేయడానికి చాలామంది కథానాయికలు ముందుకు రాలేదట. అప్పుడు సదా ధైర్యంగా ముందుకు వచ్చిందనేది టాక్. ఈ సినిమాలోని పాత్రలను దర్శకుడు మజీద్ మలిచిన తీరు సదాకి బాగా నచ్చిందట. అందువలన ఆయనతో ఒక సినిమాను నిర్మిస్తానని సదా చెప్పడం విశేషం.   

  • Loading...

More Telugu News