pulivendula: వైసీపీకి పులివెందుల 'రెడ్డి బ్రదర్స్' గుడ్ బై.. టీడీపీలో చేరిక

  • టీడీపీలో చేరిన శ్రీనాథ్ రెడ్డి, నారాయణ రెడ్డి
  • వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు
  • పార్టీ విధానాలు నచ్చకే టీడీపీలో చేరిక

వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఆ పార్టీకి షాక్ తగిలింది. నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేతలు శ్రీనాథ్ రెడ్డి, నారాయణ రెడ్డి సోదరులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి వైయస్ కుటుంబానికి వీరిద్దరూ అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. వైసీపీ విధానాలు, నిర్ణయాలు నచ్చకే రెడ్డి బ్రదర్స్ ఇద్దరూ సైకిల్ ఎక్కారు. వీరిద్దరూ బలపనూరుకు చెందినవారు. రెడ్డి బ్రదర్స్ ను టీడీపీ నేతలు బీటెక్ రవి, సతీష్ రెడ్డి తదితరులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ, పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ బలపడుతోందని చెప్పారు. పార్టీలోకి ఎవరు వచ్చినా, ఆహ్వానిస్తామని అన్నారు. 

pulivendula
balapanur
srinath reddy
narayana reddy
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News