kota srinivasarao: కోట శ్రీనివాసరావు కూడా చాలా సార్లు బాధపడ్డారు: సంధ్య

  • ఇండస్ట్రీలో నాలుగు కుటుంబాల మాఫియా నడుస్తోంది
  • కొత్తవాళ్లు పరిశ్రమలోకి రాకుండా అణచి వేస్తున్నారు
  • లైంగిక దోపిడీకి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది

తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు కుటుంబాల మాఫియా నడుస్తోందని పీవోడబ్ల్యూ నేత సంధ్య ఆరోపించారు. కొత్తవాళ్లు పరిశ్రమలోకి రాకుండా అణచివేస్తున్నారని మండిపడ్డారు. చిన్న సినిమాలకు థియేటర్లు కూడా దొరకకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. వీరికి సంబంధించిన సినిమాలు మాత్రమే థియేటర్లో ఆడేలా చేస్తున్నారని విమర్శించారు.

చిన్న సినిమాలు సక్సెస్ అయినా, నెగెటివ్ రివ్యూలు రాయిస్తున్నారని ఆరోపించారు. పరిశ్రమలో జరుగుతున్న లైంగిక దోపిడీకి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. కమిట్ మెంట్ కావాలని అడిగేవారిని చెప్పుతో కొట్టాలంటూ సినిమా పెద్దలే పిలుపునివ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగులో ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్లు ఉన్నా... పక్క రాష్ట్రాల నుంచి విలన్లను తీసుకొస్తున్నారని కోట శ్రీనివాసరావు ఎన్నోసార్లు బాధను వ్యక్తం చేశారని ఆమె గుర్తు చేశారు.

kota srinivasarao
sandhya
tollywood
  • Loading...

More Telugu News