tammareddy bharadwaja: చంద్రబాబు దీక్షకు సినీ పరిశ్రమ మద్దతు: తమ్మారెడ్డి భరద్వాజ

  • ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
  • హోదా విషయంలో కేంద్రం ఎందుకు వెనకడుగు వేసిందో! 
  •  ఐదేళ్లలో ఏపీకి సినీ పరిశ్రమ వస్తుందని భావిస్తున్నా

ప్రత్యేక హోదా కోసం ఏపీలోని అన్ని పార్టీలు కలిసి పోరాడాలని సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ విన్నవించారు. హోదా ఇస్తామంటూ తొలుత హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత ఎందుకు వెనకడుగు వేసిందో అర్థం కావడం లేదని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు ఒప్పుకోవడం లేదంటూ తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారని... ప్రత్యేక హోదాకు తాము అడ్డంకి కాదని సాక్షాత్తు ఆర్థిక సంఘం ఛైర్మన్ చెప్పారని గుర్తు చేశారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు చేపడుతున్న నిరాహారదీక్షకు సినీ పరిశ్రమ మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని అన్నారు. మరో ఐదేళ్లలో ఏపీకి తెలుగు సినీ పరిశ్రమ వస్తుందని తాను భావిస్తున్నట్టు తమ్మారెడ్డి తెలిపారు. అమరావతికి ఇండస్ట్రీని తరలించాలని ఇంతవరకు ఎవరూ పిలవలేదని చెప్పారు. సినీ పరిశ్రమకు ఎలాంటి రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేదని... కేవలం సహకరిస్తే చాలని అన్నారు. 

tammareddy bharadwaja
tollywood
Chandrababu
hunger strike
special status
  • Loading...

More Telugu News