v hanumantha rao: చంద్రబాబు నిరాహారదీక్షకు కారణం ఇదే!: వి.హనుమంతరావు

  • ఏపీని మోసం చేసింది చంద్రబాబు కాదు
  • వెంకయ్యకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలి
  • నగదు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు

ఏపీ ప్రజలను మోసం చేసింది చంద్రబాబు కాదని, కేంద్ర ప్రభుత్వమే వంచించిందని తెలంగాణ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని, ఆ తర్వాత ఆ హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించడానికే చంద్రబాబు నిరాహారదీక్షకు తిగుతున్నారని చెప్పారు.

ఏపీపై వెంకయ్యనాయుడికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా... ఉపరాష్ట్రపతి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వెంకయ్య రాజీనామా చేస్తే... మోదీ, అరుణ్ జైట్లీలకు భయం కలుగుతుందని చెప్పారు. అన్ని ఏటీఎంల వద్ద నోక్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయని, నగదు లేక ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే నగదు సమస్య వచ్చిందని మండిపడ్డారు. 

v hanumantha rao
Chandrababu
hunger strike
Venkaiah Naidu
Narendra Modi
Arun Jaitly
  • Loading...

More Telugu News