voshal: క్యాస్టింగ్ కౌచ్ ఉందని సింపుల్ గా అనేయొద్దు.. నిరూపించండి.. న్యాయం జరుగుతుంది: విశాల్ సూచన
- అన్యాయం జరిగిందని గళమెత్తే స్త్రీలను గౌరవిస్తాను
- వాటిని ఆధారాలతో నిరూపించగలగాలి
- అలా వరలక్ష్మి, అమలాపాల్ లకు న్యాయం జరిగింది
చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని సింపుల్ గా అనేయొద్దని నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ, సినీ నటుడు విశాల్ తెలిపాడు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, క్యాస్టింగ్ కౌచ్ జరిగిందని ఆధారాలతో నిరూపించాలని సూచించాడు. అప్పుడు కచ్చితంగా బాధితులకు న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశాడు. ఎవరో ఒకరిద్దరు చేసే నీచపు పనులను సినీ పరిశ్రమ మొత్తానికి అంటించవద్దని విశాల్ సూచించాడు.
గతంలో వరలక్ష్మి, అమలాపాల్ అలాంటి ఆరోపణలతో నడిగర్ సంఘాన్ని ఆశ్రయిస్తే న్యాయం చేశామని ఆయన గుర్తు చేశాడు. సినీ పరిశ్రమలో అన్యాయం జరిగిందని గళమెత్తే స్త్రీలను తాను గౌరవిస్తానని, అన్యాయం జరిగితే కచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలుగు చిత్రపరిశ్రమలో నెలకొన్న వివాదం త్వరలోనే పరిష్కారమవుతుందని ఆశిస్తున్నానని విశాల్ అన్నాడు.