charan: 'రంగస్థలం' విలేజ్ సెట్ ను తొలగిస్తారా? అనే ప్రశ్నకి సుకుమార్ సమాధానం!

  • 50 రోజుల్లో విలేజ్ సెట్ వేశాము 
  • సెట్ తొలగించే ఆలోచన లేదు 
  • మిగతా వాళ్లు దానిని ఉపయోగించుకుంటున్నారు

'రంగస్థలం' సినిమా విషయంలో సుకుమార్ ఎంత అంకితభావంతో పనిచేశాడనేది, ఆయన వేయించిన విలేజ్ సెట్ చూస్తే తెలిసిపోతుంది. నిజంగా ఒక గ్రామంలోనే షూటింగ్ చేశారా అనిపించేంత సహజంగా ఈ సెట్ వేశారు. ఈ సినిమా విజయంలో ఈ సెట్ కూడా ప్రధానమైన పాత్రను పోషించింది.

అలాంటి ఈ విలేజ్ సెట్ కు ఎంత సమయం పట్టింది? దానిని ఎప్పుడు తీసేస్తున్నారు? అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆయనకి ఎదురైంది. అందుకు సుకుమార్ స్పందిస్తూ .. " ఈ సినిమా కోసం విలేజ్ సెట్ వేయడానికి 50 రోజులు పట్టింది. హైదరాబాద్ ..  భూత్ బంగ్లా సమీపంలో ఈ సెట్ ను వేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈ సెట్ ను తొలగించే ఆలోచన లేదు. చిన్న చిన్న మార్పులు చేసి వేరే సినిమాల వాళ్లు దానిని ఉపయోగించుకుంటున్నారు" అని చెప్పుకొచ్చారు.    

  • Loading...

More Telugu News