Tollywood: తొలిసారి అరెస్ట్ అయ్యాను... ఈ అనుభూతి బాగుంది!: ఫేస్ బుక్ లో నటి మాధవీ లత

  • మౌన దీక్ష చేస్తున్న మాధవీ లత అరెస్ట్
  • జీవితంలో తొలిసారి స్టేషన్ కు వచ్చాను
  • చేతిలో ఫోన్ ఒక్కటే ఉండనిచ్చారన్న మాధవీ లత

హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ ముందు పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మౌన దీక్ష చేస్తున్న నటి మాధవీ లతను ఈ ఉదయం బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించిన సంగతి తెలిసిందే. దీనిపై తన ఫేస్ బుక్ ఖాతాలో స్పందించిన మాధవీలత, "నా జీవితంలో తొలిసారి పోలీస్ స్టేషన్ కు వచ్చాను. నేను అరెస్ట్ అయ్యాను. నన్ను బయటకు వదలడం లేదు. చేతిలో ఫోన్ ఒక్కటే ఉంచారు. అయితే, ఈ అనుభూతి బాగుంది" అని ఓ పోస్టు పెట్టింది.

Tollywood
Film Chamber
Casting Couch
Madhavi latha
  • Loading...

More Telugu News